బనగానపల్లె: బనగానపల్లె బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మైనార్టీ సోదరుల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీఖానా పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తనిఖీ చేశారు. హాల్ నిర్మాణ నాణ్యత, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొని భవన నమూనాను పరిశీలించారు.