ఆళ్లగడ్డ: మిట్టపల్లి జాతరలో దళితులకు అవమానం జరగలేదు గ్రామస్తులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలో మిట్టపల్లి జాతరలో దళితులకు అవమానం జరిగిందంటూ వ్యాఖ్యలను గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు, మంగళవారం గ్రామంలో రెవెన్యూ పోలీస్ అధికారులు గ్రామసభ నిర్వహించారు, గుర్తుతెలియని ఆకతాయిలు సోషల్ మీడియాలో అవాస్తవాలను వైరల్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని అధికారులకు వివరించారు, అందరూ ఐకమత్యంతో దేవరను జరుపుకున్నామన్నారు వారు స్పష్టం చేశారు