సర్వేపల్లి: కంటేపల్లిలో ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట, పాల్గొన్న సోమిరెడ్డి
వెంకటాచలం మండలం కంటేపల్లిలో శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. , నంది, నవగ్రహాల ప్రతిష్ట, మహాకుంభాభిషేక మహోత్సవంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంటేపల్లిలో పలు దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని సోమిరెడ్డి బుధవారం తెలిపారు. కామన్ గుడ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేయించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.