అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం స్వచ్ఛ ఆంధ్రపై పరిశుభ్రత పచ్చదనం పై శిక్షణ కార్యక్రమాలను వెలుగు ఏపీఎం సురేఖ ఎంపీడీవో లక్ష్మీనారాయణ మాస్టర్ ట్రైనర్ సత్యసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రత పారిశుధ్యం పై గ్రీన్ అంబాసిడర్ల వ్యవస్థపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున వెలుగు సీసీలు రాం ప్రభువు మంజునాథ శివప్రసాద్ నారాయణప్ప, మహిళా సమైక్య భాగ్యమ్మ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.