ఇంకొల్లు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి.
రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మృతి బాపట్ల జిల్లా ఇంకొల్లు తహశీల్దార్ కార్యాలయ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంకొల్లు నుంచి గంగవరం వెళ్తున్న వరిగడ్డి ట్రాక్టర్, టీవీఎస్ వాహనం ఢీ కొన్నాయి. ఈసంఘటనలో టీవీఎస్ వాహనం పై చీపుర్లు అమ్ముకుంటున్న మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన సూరగాని సుబ్బారావు(73) అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేశారు.