నందికోట్కూరు: కృష్ణ నీటిని విడుదల చేసి రాయలసీమ పంటలు కాపాడాలి CPIML లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కలి వెంకటేశ్వర్లు
నంద్యాల జిల్లా నందికొట్కూరు శ్రీశైలం రిజర్వాయర్ పోతిరెడ్డి వాడు హెడ్ రెగ్యులేటర్ నీటిమట్టం ప్రస్తుతం 850 అడుగులు ఉందని CPIML లిబరేషన్ జిల్లా కార్యదర్శి తిక్కలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు, ఆదివారం పట్టణములోని వినోద్ మిశ్రా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మల్యాల హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి కృష్ణ నీరు విడుదల చేసి రాయలసీమ రైతుల పంటలు కాపాడాలని కోరారు, ఇప్పటికే ఖరీఫ్లో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీ చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి నీటిని విడుదల చేయించాలని కోరారు