ఒంగోలు అర్బన్: ఒంగోలులో ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తపోటుపై పోలీసులకు అవగాహన కల్పించిన వైద్యులు
Ongole Urban, Prakasam | May 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గురువారం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు యోగ, మెడిటేషన్ ప్రాముఖ్యతను వివరించి రక్తపోటుని నియంత్రణలో ఉంచుకోవాలంటే రోజు తగిన వ్యాయామం చేయాలన్నారు. ఎస్పీ ఆదేశాలతో గత రెండు రోజులుగా రక్తపోటు పై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.