డోన్: తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు: బేతంచెర్ల లో డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | May 9, 2026 జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని MLA కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. బేతంచెర్లలోని కొత్త బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యం కోసం మాజీ ఎంపీటీసీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. తల్లిదండ్రుల గుర్తుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఆర్టీసీ డీఎం శశిభూషణ్ పాల్గొన్నారు.