బనగానపల్లె: బనగానపల్లె సబ్ జైల్ హెడ్ కానిస్టేబుల్ చేతివాటం, పెట్రోల్ బంకులో రూ.74 లక్షల నిధులు స్వాహా
బనగానపల్లె సబ్ జైలు ప్రాంగణంలో ఖైదీలతో నడుస్తున్న హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులు రూ 74 లక్షల రూపాయలు నిధులను పక్కదారి పట్టించిన ఘటన వెలుగు చూసింది. సబ్ జైల్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రామచంద్రారెడ్డి పెట్రోల్ బంక్ కు సంబంధించి 74 లక్షల రూపాయలను తన సొంత ఖర్చులకు వాడుకున్నాడు. ఈ విషయం ప్రభుత్వం ఆడిట్లో బయటపడింది. సబ్ జైలు సూపర్ డేనినెంట్ యోగేష్ కుమార్ సోమవారం బనగానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సదరు హెడ్ కానిస్టేబుల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2022 నుండి 2025 వరకు భారీ ఎత్తున రామచంద్రారెడ్డి పెట్ర