ఒంగోలు అర్బన్: ఒంగోలులో నాయి బ్రాహ్మణులు నిరసన, మహేంద్ర ను హత్య చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Ongole Urban, Prakasam | Jul 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రామారావు అనే వ్యక్తి గురువారం మహేంద్ర అనే బార్బర్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. మద్యం తాగి దుకాణంలోకి వస్తున్న సమయంలో దుకాణంలోకి మహేంద్ర రావద్దని గ్రామాలకు చెప్పాడు. దీంతో కోపం తెచ్చుకున్న రామారావు మహేంద్ర ను కత్తెరతో గొంతులో పొడిచాడు. మహేంద్ర ను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహం చెందిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు శుక్రవారం ఒంగోలు పట్టడంలో నిరసనకు దిగి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.