సంగారెడ్డి: వైకుంటపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం శనివారం కావడంతో సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురం శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్థానిక ప్రజలతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, పటాన్చెరు, హందోల్ జహీరాబాద్ దౌల్తాబాద్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు క్యూలైన్లలో నిలబడి తమ ఆరాధ్య దైవం శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ట్రస్టు సభ్యు లు భక్తులందరికీ అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు చేశారు.అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.