డోన్: డోన్ మండలంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన
Dhone, Nandyal | Jun 22, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం లక్ష్మింపల్లెలోని కొన్ని ప్రాంతాల్లో రెండు నెలలుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని బాధిత మహిళలు ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. గ్రామంలోని పలుచోట్ల నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోయారు.