విశాఖపట్నం: చిరు వ్యాపారులని యధావిధిగా కొనసాగించాలని జోనల్ కమిషనర్ ను కోరిన గాజువాక హాకర్స్ జోన్ సభ్యులు
గాజువాక జోనల్ కార్యాలయంలో స్ట్రీట్ వే0డర్స్ ను ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించినందుకు గాజువాక హకర్స్ జోన్ సభ్యులు జోనల్ కమిషనర్ తో చర్చలు జరిపి యధావిధిగా దుకాణదారులను తీయవద్దని అభ్యర్థించారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర చేసిన ధర్నాకు కమిషనర్ స్పందించారని ఈ మేరకు ఆయా జోన్ కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులతో మాట్లాడాలని చెప్పారు. ఈ చర్చల్లో యధావిధిగా షాపులు మరియు బండ్లు ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చేంతవరకు మీరు వ్యాపారాలు చేసుకోవచ్చని ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించడం అన్యాయమని సభ్యులు వాపోయారు.