కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం రాష్ట్ర రైతులకు వరం అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. బుధవారం నాయుడుపేట మండలం లోని కూచివాడ గ్రామంలో రైతన్నా-మీకోసం కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే రైతులను కలుసుకున్నారు. అనంతరం ప్రతి రైతు ఇంటికి వెళ్లి రైతన్నా-మీకోసం కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు, సబ్సిడీలు, బీమా, నష్టపరిహారం, పంట పెట్టుబడి, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద ప్రతి రైతుకు రెండు విడతల్లో మొత్తం రూ 14,000 సహాయం అందించామని