తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఓ యువకుడు రైలు నుంచి జారిపడి చనిపోయాడు. లింగంపల్లి నుంచి సింగరాయకొండకు జనరల్ టికెట్ తీసుకుని నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో ఓ యువకుడు ఎక్కాడు. ఆదివారం అర్ధరాత్రి తెలంగాణలోని శ్రీరామపురం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ నుంచి జారిపడి చనిపోయాడు. మృతుడి వివరాలు తెలిసిన వాళ్లు నల్గొండ రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.