పోలింగ్ నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకం: జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు ప్రదీప్ కుమార్
సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముఖ్య ఘట్టమైన పోలింగ్ నిర్వహ ణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు పరదీప్ కుమార్ ఐఏఎస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు ఓఎన్జిసి గెయిల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థల్లో సూక్ష్మ పరిశీలకులుగా నియమించిన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని సాధారణ పరిశీలకుల సమక్షంలో నిర్వహించారు.