నార్త్ జోన్ పరిధిలోని వైన్ షాప్ల యజమానులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ నిబంధనలు, ప్రజాభద్రతపై డీసీపీ రష్మీ పెరుమాళ్ సూచనలు చేశారు. నిర్ణీత సమయాల్లోనే మద్యం విక్రయాలు చేయాలని, మైనర్లకు విక్రయం నిషేధమన్నారు. గుమికూడకుండా క్రమశిక్షణ పాటించాలని, అక్రమ విక్రయాలు, అధిక ధరలు వద్దని హెచ్చరించారు. CCTV, భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.