డోన్: బేతంచెర్ల మండలంలో జాతీయ రహదారిపై లారీ,పాల ట్యాంకర్ డి
Dhone, Nandyal | Jul 13, 2026 బేతంచెర్ల మండలం హెచ్ కొట్టాల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం వెళ్తున్న ఎరువుల లారీ ముందు చక్రం యాక్సిల్ విరిగిపోవడంతో అదుపు తప్పింది. అది ముందు వెళ్తున్న పాల ట్యాంకరు వెనుకగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న హమాలీ మల్లికార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.