డోన్: ప్యాపిలి మండలంలో టిడిపి నాయకుడు మృతి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 7, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఏనుగు మర్రి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాఘవరెడ్డి (54) మృతి పట్ల డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.