పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బెలుగుప్ప మండల ప్రత్యేక అధికారి విశ్వనాథరెడ్డి, వజ్రకరూరు మండల తాసిల్దార్ నరేష్ ఎంపీడీవో శివాజీ రెడ్డిలు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాల వద్ద శనివారం మండల అధికారులు టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున తదితరులతో కలిసి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి నిర్వహించారు.