12 రోజులు పూర్తయిన గ్యాస్ ఇవ్వడం లేదంటూ వెలుగోడు పట్టణంలో గ్యాస్ ఆటోను అడ్డుకున్న గ్రామస్తులు
వెలుగోడు పట్టణం ద్వారకానగర్ పోస్టాపీసు వద్ద గ్రామస్థులు గురువారం గ్యాస్ ఆటో ను అడ్డకుని పంపిణి ని అడ్డుకున్నారు.గ్యాస్ డెలివరీ బుకింగ్ చేసుకున్న వినియోగ దారులకు 12 రోజులకు కూడా అందడం లేదు. అధికారులేమో గ్యాస్ ఎలాంటి కొరత లేదంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ గ్రామాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ డెలివరీ కోసం సిబ్బంది రాగా , బిల్లుల ప్రకారం ఇంటింటికి వెళ్లి ఇవ్వకుండా, ఒకేచోట నిలపెట్టుకొని వచ్చిన అందరికి ఇవ్వడం ఏంటని ఘర్షణకు దిగారు.ఇక్కడే అందరికి ఇవ్వడం లో ఆంతర్యం ఏమిటి, ఎక్కువ రేటు తీసుకొని ఇస్తున్నారా అంటూ ఆరోపణలు చేశారు.