సంతనూతలపాడు: పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మై టిడిపి యాప్ పై టిడిపి నాయకులు, కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం
సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై టిడిపి యాప్ పై టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షులు మద్దినేని హరిబాబు మాట్లాడుతూ.... టిడిపి కుటుంబ సాధికార కమిటీ సభ్యులుగా నియమితులైన వారు తమ మొబైల్ ఫోన్లలో మై టిడిపి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మై టిడిపి యాప్ ద్వారా కుటుంబ సాధికార కమిటీ సభ్యులు తమకు కేటాయించిన నివాసాలకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని యాప్ లో నమోదు చేయాలన్నారు. తద్వారా వారి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు.