మధిర: బ్రాహ్మణపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదుకై సహకరించండి: ప్రధానోపాధ్యాయులు గుగులోత్ రామకృష్ణ
బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి అంగన్వాడి కేంద్రంలో ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్యలో విద్యార్థులు శారీరక, మానసిక అభివృద్ధి జరుగుతుందని, 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని అన్నారు.