చీమకుర్తి పట్టణంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు గ్రానైట్ కార్మికులతో మంగళవారం సమావేశం అయ్యారు .ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ... కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ నిరసనగా ఈనెల 26న చీమకుర్తిలో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కార్మికులంతా కలిసికట్టుగా ఉద్యమించి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు.