సంగెం: కాట్రపల్లి,వెంకటాపూర్ గ్రామాల మధ్య ఉన్న వాగును అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే
ప్రజలకు ఇబ్బందులు రాకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు అన్నారు బుధవారం సంగెం మండలం కాట్రపల్లి, వెంకటాపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి వాగు గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి కొట్టుక పోవడంతో అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక రహదారి నిర్మాణం, మరియు శాశ్వత వంతెన పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.ప్రజలు వర్షాలు తగ్గే వరకు, అధికారుల సూచనలు పాటించాలని, అన్నారు