ఒంగోలు అర్బన్: ఒంగోలులో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు
Ongole Urban, Prakasam | Jun 28, 2026
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని వెంటనే అరెస్టు చేయాలని ఒంగోలులో వైసిపి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు అనంతరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని వైసిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.