గుంతకల్లు: గుత్తి పట్టణంలోని ఆర్అండ్ బీ అతిథి గృహం ఎదుట దుకాణాలు తొలగించరాదని ఎంపీ అంబికా కు వినతి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్అండ్ బీ అతిథి గృహం ఎదురుగా ఉన్న తమ దుకాణాలు తొలగిస్తే ఉపాధి కోల్పోతామని దుకాణాలు తొలగించరాదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు దుకాణదారులు వినతి పత్రం అందజేశారు. గురువారం పట్టణంలో దుకాణాల నిర్వాహకులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కలిశారు. ఈ సందర్భంగా దుకాణాల నిర్వాహకులు మాట్లాడుతూ గుత్తి పట్టణంలోని ఆర్అండ్ బీ అతిథి గృహం ఎదురుగా గత 40 సంవత్సరాలుగా రోడ్డు పక్కన దుకాణాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నామన్నారు. ఇప్పుడు ఉన్నఫళంగా దుకాణాలు తొలగిస్తే తాము జీవనాధారం కోల్పోతామని అన్నారు. దుకాణాలు తొలగిస్తే ఇక తామెలా బతకాలని అన్నారు.