ఇచ్చోడ: అడిగాం-బి లో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే,పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం:ఎంపీడీవో లక్ష్మణ్
ఇచ్చోడ మండలం అడిగాం-బి గ్రామంలో గురువారం ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభమైందని ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు. మండల పరిషత్,తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కోసం అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.ఇంటింటికి సిబ్బంది వచ్చి సర్వే చేయటం జరుగుతుందని, ఇంటి యజమానిగా మహిళ పేరు,తదుపరి కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేస్తారని తెలిపారు.