శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
ఎస్సై .ఉమామహేశ్వర్ రెడ్డి,
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తంబళ్లపల్లె ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి రౌడీషీటర్లను హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగాలని అసాంఘిక కార్యక్రమాలకు వెళ్లరాదని రౌడీ షీటర్లకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.