ఉరవకొండ: పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం "ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ నిర్వహించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.