బనగానపల్లి పట్టణంలో బైకులో చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం
బనగానపల్లె పట్టణంలో ఆస్థానం వద్ద సమీర్ అనే వ్యక్తి అతని స్నేహితుడితో బైక్పై వెళ్తుండగా ఒక్కసారిగా బైక్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సమీర్ వెంటనే బైక్ దిగి పక్కకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి వాటర్తో మంటలను ఆర్పివేశారు. పాత బైక్ కావడంతో పెట్రోల్ లీక్ అయి ప్రమాదం జరిగినట్టు సమీర్ గురువారం తెలిపాడు.