వెంకటాపురం: ప్రజలకు సేవ చేస్తానని గద్దెనెక్కిన మంత్రి సీతక్క ఇచ్చిన హామీలు ఏమయ్యాయి : ములుగు BRS నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగజ్యోతి
ప్రజలకు సేవ చేస్తానని గద్దెనెక్కిన మంత్రి సీతక్క ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ములుగు BRS నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగజ్యోతి నేడు ఆదివారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు ప్రశ్నించారు. మంత్రి సొంత గ్రామం జగ్గన్నపేటలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెప్పడానికి బుద్ధుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, యూరియా కొరత లేదని నిరూపిస్తారా అని సవాల్ విసిరారు.