రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది: మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన సాగిస్తోందని విమర్శించారు.