జహీరాబాద్: గ్రామపంచాయతీలకు ఆర్డిఓ దేవుజ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లోని గ్రామపంచాయతీలకు డ్రా పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆదివారం జహీరాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆర్డీవో దేవుజా ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో డ్రాలు తీసి పంచాయతీలకు రిజర్వేషన్లను ప్రకటించారు. నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలకు 22, జరా సంఘం 33, కోహిర్ 23, న్యాల్కల్ 38 గ్రామ పంచాయతీలున్నాయి. కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.