ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వెంటనే చర్యలు తీసుకోవాలి.
బహుజన యువసేన అధ్యక్షులు.
పునీత్ డిమాండ్.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సర్వజన ఆస్పత్రిలో మందులు కొరత కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారని మదనపల్లె బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు కొరత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూపర్డెంట్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో మందులు లేక రోగులు, అవస్థలు పడుతున్నారని వెంటనే అధికారులు స్పందించి రోగులకు మందులు అందుబాటులో తేవాలని కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.