పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని వర్ధన్నపేట లో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిన ఇప్పటికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోగా... విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుమాలిన చర్య అని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు...