ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 18వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి
Ongole Urban, Prakasam | Jun 15, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాలలో ఈనెల 18వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. ఉరుములు మెరుపులతోపాటు ఈదురు గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న ఉన్న నేపథ్యంలో చెట్ల కింద రైతులు ప్రజలు ఉండకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవనలు చురుగ్గా ఉండటం వల్ల వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు.