ఒంగోలు అర్బన్: ఒంగోలులోని రాజధాని సెంటర్లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
Ongole Urban, Prakasam | May 31, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని రాజధాని సెంటర్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి గాలిలోకి ఎగిరి కారు అద్దాలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.