కోడుమూరు: గూడూరులో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు, స్వామి చిత్రపటంతో కురుబలు ర్యాలీ
భక్త కనకదాసు జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన వేడుకలకు ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. శనివారం సాయంత్రం గూడూరుకు విచ్చేసిన ఎంపీ ముందుగా స్థానిక బీరప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్త కనకదాసు చిత్రపటంతో కురుబలు ఆలయం నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో గూడూరు, పరిసర గ్రామాల నుంచి కురుబలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్త కనకదాసు చూపిన మార్గం అందరికీ ఆదర్శమని ఎంపీ కొనియాడారు.