ఒంగోలు అర్బన్: సర్ ప్రక్రియ పురోగతిపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక కావాలి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 30, 2026
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రతి రెండు గంటలకు పురోగతిని తన దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ' సర్ ' పురోగతిపై సమీక్షించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ మరియు సంతనూతలపాడు ఈ.ఆర్.వో. మాధురి, ఇతర ఈ.ఆర్.వో.లు చంద్రశేఖర్ నాయుడు ( ఒంగోలు ), విజయ జ్యోతి ( అద్దంకి ), రవికుమార్ ( కొండపి ) లతో కలెక్టర్ ప్రత్యేకంగా చర్చించారు.