కరంపూడిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ఆందోళన
ఉద్యోగాలు,నష్టపరిహారం ఇస్తామని నమ్మించి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మోసం చేసిందని ఇనుప రాజు పల్లి, సమీప గ్రామాల రైతులు గురువారం ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన దిగారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలో భూములు తీసుకుని గురజాల పరిధిలోకి వెళ్లి ప్లాంట్ నడుపుతున్నారని ఆందోళన చేశారు. రెండు పంటలు పండే భూములు కోల్పోయి, తమ పిల్లలకు ఉద్యోగాలు రాక తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేయాలన్నారు.