నంద్యాల అర్బన్: మహానందిశ్వరుని సేవలో హైకోర్టు జడ్జి
Nandyal Urban, Nandyal | Apr 19, 2026
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి హరిహరనాథ శర్మ పూజలు చేశారు. వీరికి ఆలయ ఈవో ఎన్.శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీస్వర స్వామి అమ్మవారు దర్శించుకుని అభిషేకం,కుంకుమార్చన, పూజలు నిర్వహించుకున్నారు. పూజల అనంతరం ఈవో శేష వస్త్రంతో సత్కరించి,స్వామి వారి జ్ఞాపకను అందజేయగా, వేద పండితులు వేద ఆశీర్వాదాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట మహానంది ఎస్ ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి, సిబ్బంది శేషు, నారాయణస్వామి హుసేని, తదితరులు పాల్గొన్నారు.