జహీరాబాద్: చిరాగ్ పల్లి చెక్పోస్ట్ వద్ద చారస్ మత్తు పదార్థం, 17 లీటర్ల మద్యం పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని చిరాగ్ పల్లి చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు చారస్ మత్తు పదార్థం పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం వాహనాలు తనిఖీ నిర్వహించి ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళుతున్న జీప్ వాహనంలో 8 గ్రాముల చారస్ మత్తు పదార్థం, వాహనం సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. గోవా నుండి ఇతర వాహనాల్లో తరలిస్తున్న 17 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో గాంధీ నాయక్ తో పాటు ఎస్ఐలు హనుమంతు, యాదయ్య, రమేష్, మురళి, ఇబ్రహీం రాజా సిబ్బంది ఉన్నారు.