ఒంగోలు అర్బన్: పారిశ్రామికవేత్తలతో సదస్సు కు సంబంధించిన
ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 13, 2026
జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఈనెల 22వ తేదీన పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సదస్సు ( ఎలైట్ బిజినెస్ మీట్ ) నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు నిర్ణయించారు. దీనికి ఒంగోలులోని ఎస్.జీ.వి.ఎస్. కన్వెన్షన్ హాలును వేదికగా ఎంపిక చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలపై శనివారం సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సదస్సు విజయవంతం అయ్యేందుకు ఇప్పటినుంచే దృష్టి సారించాలని వారికి దిశానిర్దేశం చేశారు.