బొంరాస్ పేట: మదనపల్లి తండాలోని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు
టాయిలెట్స్ లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు వికారాబాద్ జిల్లా బొమ్మరేస్పేట్ మండల పరిధిలోని మదనపల్లి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మూత్రశాలాలూ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తండావాసులు విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలలో 30 మంది విద్యార్థులు కలరని టాయిలెట్స్ కు ఆరు బయట కు పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నూతన టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, గ్రామస్తులు, నేడు మంగళవారం తెలిపారు.