కర్నూలు: కర్నూలు మార్కెట్ యార్డ్ కు ఉల్లి పోటెత్తింది: నగరంలో ఉల్లిలోడులతో వాహనాలు బారులు తీరాయి.
కర్నూలు మార్కెట్ యార్డుకు ఉల్లి పోటెత్తింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కర్నూలు నగరంలోని మార్కెట్ యార్డ్ నుండి బళ్లారి చౌరస్తా వరకు ఉల్లి లోడుతో వాహనాలు బారులు తీరాయి. గత రెండు రోజులుగా ఈనెల 13,14వ తేదిలల్లో మార్కెట్ యార్డ్ సెలవు రోజులుగా ఉండడంతో ఉల్లిని సోమవారం అనగా ఈనెల 15న సోమవారం విక్రయించేందుకు ఆదివారం మధ్యాహ్నం నుండి ఉల్లి రైతులు తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉల్లి లోడు వాహనాలు మార్కెట్ యార్డ్ లోకి వెళ్లేందుకు బారులు తీరాయి.