ముమ్మిడివరం మండలం గోదశివారిపాలెం గ్రామంలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గోదశివారిపాలెం గ్రామంలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.