ఆళ్లగడ్డ: మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాటును పరిశీలించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఈనెల 15న మంత్రి నారా లోకేష్ ఆళ్లగడ్డ నియోజకవర్గ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోలీస్ అధికారులతో కలిసి శనివారం ఏర్పాట్లను పరిశీలించారు, బహిరంగ సభ వేదిక ఏర్పాటు సభకు వచ్చే ప్రజల రాకపోకలు ట్రాఫిక్ నియంత్రణ పటిష్టమైన భద్రత వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు, లోకేష్ పర్యటన విజయవంతనికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు