శ్రీశైల క్షేత్రంపై మొంథా తుఫాను ప్రభావం
పాతాళగంగ మెట్ల మార్గంలో విరిగిపడిన కొండ చరియలు
శ్రీశైలం మహా క్షేత్రంలో మొంథా తుఫాను ప్రభావం తీవ్రస్థాయిలో కనబడుతుంది,శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో జనజీవనం స్తంభించింది క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గదులకే పరిమితమయ్యారు మరోవైపు శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంపై కొండ చర్యలు విరిగిపడడంతో మూడు షాపులు ధ్వంసం అయ్యాయి ,భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు అంతేకాకుండా వరద నీరు దిగువకు నది వలె ప్రవహిస్తూ ఉండడంతో ఇళ్ల ముందు ఉన్న మట్టి రోడ్డు కాస్త కోతకు గురైంది ఇలాగే కొనసాగితే పాతలగంగా మెట్ల మార్గంలో తీవ్రస్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది,