ఒంగోలు అర్బన్: ఒంగోలు టిడిపి కార్యాలయం వద్ద మహిళా నాయకులు సంబరాలు, మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించడం పై ఆనందం
Ongole Urban, Prakasam | May 30, 2026
ఒంగోలు టిడిపి కార్యాలయం వద్ద మహిళా నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో మహిళా నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజుల పాటు తిరిగిన మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంపై నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. మహిళ రిజర్వేషన్ బిల్లు తీర్మానం పెట్టి ఆమోదించడంపై మహిళలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.